ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిషా, ఛత్తీస్‌ఘడ్‌లలో సెప్టెంబర్ 22, 2018న పర్యటించనున్నారు.
ఒడిషాలోని తాల్చేర్‌లో ఆయన తాల్చేర్ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
దేశంలో తొలి కోల్ గ్యాసిఫికేషన్ ఎరువుల కర్మాగారం ఇది. ఎరువుల తయారీతోపాటు ఈ ప్లాంటు
సహజవాయువును ఉత్పత్తి చేసి దేశ ఇంధన అవసరాలను తీరుస్తుంది.
అనంతరం ప్రధానమంత్రి ఝార్ఖండ్ వెళతారు. అక్కడ ఆయన ఝార్సుగూడ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు.ఈ విమానాశ్రంయ పశ్చిమ ఒడిషాను దేశ విమానయాన రంగం పటంలో స్థానం కల్పిస్తుంది. అలాగూ యుడిఎఎన్ పథకం ద్వారా ప్రాంతీయ విమాన యాన అనుసంధానతను కల్పిస్తుంది.
ప్రధానమంత్రి గర్జనబహల్ బొగ్గు గనులను,ఝార్సుగూడ- బారాపాలి-సర్‌డెగా రైలు లింక్‌ను జాతికి అంకితం చేస్తారు.
దులంగా బొగ్గుగనులనుంచి బొగ్గు ఉత్పత్తి రవాణాను ప్రారంభానికి సూచనగా ఏర్పాటు చేసిన ఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.
అనంతరం ప్రధానమంత్రి ఛత్తీస్‌ఘడ్‌లోని జాంజ్‌గిర్ చంపా కు వెళతారు. అక్కడ ఆయన వ్యవసాయం,
సంప్రదాయ చేనేత తయారీపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు,
పెండ్రా-అనుప్పూర్ మూడవ రైల్వేలైన్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు.