ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు మిజోరమ్ లో మరియు మేఘాలయ లో పర్యటిచేనున్నారు. అక్కడ ఆయన వేరు వేరు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం చేస్తారు.
‘‘మంత్రముగ్ధులను చేసే, ప్రకృతి శోభతో అలరారే ఈశాన్య ప్రాంతం రమ్మంటూ పిలుస్తోంది. రేపు మిజోరమ్ ను మరియు మేఘాలయ ను సందర్శించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. అక్కడ పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు ఈశాన్య ప్రాంత వికాస ప్రస్థానానికి వేగాన్ని అందించగలవు.
ఆయీజోల్ లో రేపటి కార్యక్రమంలో తుయిరియల్ జల విద్యుత్తు పథకాన్ని దేశ ప్రజలకు అంకితం చేసే మహదవకాశం నాకు లభించడం నా భాగ్యం. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం మిజోరమ్ ప్రజలకు ఒక వరం.
యువ శక్తికి రెక్కలు తొడుగుతూ, DoNER రూ.100 కోట్ల నార్త్ ఈస్ట్ వెంచర్ కేపిటల్ ఫండ్ ను నెలకొల్పింది. ఈ నిధి నుండి చెక్కులను నవ పారిశ్రామికవేత్తలకు రేపు నేను పంపిణీ చేయబోతున్నాను. ఈశాన్య ప్రాంత యువతలో సంస్థలను స్థాపించాలన్న స్ఫూర్తి రగుల్కొనడం ఈ ప్రాంత సాధికారితకు శుభ సంకేతం.
శిలాంగ్ లో నేను శిలాంగ్- నాంగ్ స్తోయిన్- రోంగ్ జెంగ్- తురా రహదారిని ప్రారంభించనున్నాను. ఈ ప్రాజెక్టు అనుసంధానాన్ని మెరుగుపరచి, ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తుంది. నేను ఒక జన సభలో ప్రసంగిస్తాను కూడా.
మాకు ఈశాన్య ప్రాంతంలో అపార శక్తి సామర్థ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేయడానికి మేం నిబద్ధులమై ఉన్నాం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.