ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం జనవరి 4వ తేదీ నాడు మణిపుర్ కు మరియు అసమ్ కు వెళ్లనునున్నారు.
మణిపుర్ లో ఆయన అనేక ప్రాజెక్టు లకు మరియు పథకాలకు ప్రారంభించడం/శంకుస్థాపన లు చేస్తారు. వివిధ ప్రాజెక్టుల ప్రారంభానికి సూచకం గా ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. వీటిలో మోరేహ్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి), దోలాయీథాబీ బరాజ్ ప్రాజెక్టు, సావోంబంగ్ లో ఎఫ్ సిఐ ఆహార నిల్వ గోదాము, థంగల్ సురూన్ గంద్ లో ఈకో టూరిజం కాంప్లెక్స్, ఇంకా విభిన్న నీటి సరఫరా పథకాలు కూడా ఉన్నాయి.
సిల్చర్-ఇంఫాల్ లైన్ తాలూకు 400కెవి డబుల్ సర్క్యుట్ ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయనున్నారు.
అలాగే ఇంఫాల్ లో గల ధనమంజురీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు; క్రీడా సదుపాయాలు తదితర ప్రాజెక్టు లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ప్రధాన మంత్రి ఇంఫాల్ తూర్పు జిల్లా లో హప్తాకంజీబంగ్ లో ప్రజా సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
అసమ్ లో ప్రధాన మంత్రి సిల్చర్ లోని రాంనగర్ లో ఒక సార్వజనిక సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.