ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రయాగ్‌రాజ్ లో కుంభ్ ను సందర్శించనున్నారు. త్రాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వ శాఖ కుంభ్ లో నిర్వహించే ‘స్వచ్ఛ్ కుంభ్- స్వచ్ఛ్ ఆభార్’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకోనున్నారు.
సఫాయీ కార్మచారీల కు, స్వచ్ఛాగ్రహీల కు, పోలీసు సిబ్బంది కి మరియు నావిక్ లకు స్వచ్ఛ్ కుంభ్- స్వచ్ఛ్ ఆభార్ పురస్కారాల ను ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ్ సేవా సమ్మాన్ లాభాల ప్యాకేజీ కి సంబంధించిన డిజిటల్ అనౌన్స్‌మెంట్ కూడా ఈ కార్యక్రమం లో భాగం గా ఉండబోతోంది.
ప్రధాన మంత్రి ఆ తరువాత సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధాన మంత్రి త్రివేణీ సంగమం లో పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. ఆయన ప్రయాగ్‌రాజ్ లో సఫాయీ కర్మచారీ లతో ముఖాముఖి సంభాషించనున్నారు.
ఈ సంవత్సరం ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన కుంభ్ లో పరిశుభ్రత కు మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కు ఇదివరకు ఎరుగని విధం గా శ్రద్ధ వహించడం జరుగుతోంది. స్వచ్ఛ్ కుంభ్ లో కీలకమైనటువంటి పాత్ర ను పోషించిన వారిని ప్రధాన మంత్రి స్వచ్ఛ్ కుంభ్- స్వచ్ఛ్ ఆభార్ అవార్డు లను ప్రదానం చేయడం ద్వారా సన్మానించనున్నారు.