ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం జనవరి 2వ తేదీ న మరియు 3వ తేదీ న కర్నాటక ను సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి తుమకూరు లో గల శ్రీ సిద్దగంగా మఠాని కి వెళ్తారు. అక్కడ శ్రీ శ్రీ శివకుమార్ స్వామీజీ తాలూకు ఒక స్మారక వస్తు ప్రదర్శనశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే క్రమం లో ఓ ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు.
ప్రధాన మంత్రి ఈ యాత్ర లో భాగం గా మఠం లో ప్రార్థన లో పాలు పంచుకొంటారు. మఠం లో ఒక మొక్క ను కూడా ఆయన నాటుతారు. ఈ కార్యక్రమం లో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప తో పాటు శ్రీ సిద్దలింగేశ్వర స్వామి సహా ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో అక్కడకు విచ్చేసే జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.