అంతర్జాతీయ మహిళా దినమైనటువంటి మార్చి 8వ తేదీ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని ఝుంఝునూ కు వెళ్ళనున్నారు.
ఆడ పిల్లను కాపాడి ఆమెకు చదువు చెప్పించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్యక్రమానికి ఒక ఉత్తేజాన్ని అందిస్తూ బేటీ బచావో- బేటీ పఢావో (బిబిబిపి) కార్యక్రమాన్ని అఖిల భారతదేశానికీ విస్తరించే కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే 161 జిల్లాలలో అమలవుతుండగా, దీనిని దేశమంతటా 640 జిల్లాలకు పొడిగిస్తారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆడ పిల్లలతోను, ఈ పథకం లబ్దిదారులైనటువంటి మాతృమూర్తులతోను ప్రధాన మంత్రి సంభాషిస్తారు. బేటీ బచావో- బేటీ పఢావో కార్యక్రమంలో ఉత్తమమైన పని తీరు ను కనబరుస్తున్న జిల్లాలకు ఆయన ధ్రువ ప్రతాలను ప్రదానం చేస్తారు.
జాతీయ స్థాయిలో మరొక ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘నేషనల్ న్యూట్రిషన్ మిషన్’ (ఎన్ఎన్ఎమ్) ను ప్రధాన మంత్రి ఝుంఝునూ నుండి ప్రారంభించనున్నారు. ఎన్ఎన్ఎమ్- ఐసిడిఎస్ కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ను ఆయన ప్రారంభిస్తారు. తక్కువ స్థాయి పోషకాహారం సమస్య, తక్కువ బరువుతో జననాల సమస్యను తగ్గించడానికీ, చిన్న పిల్లలు, మహిళలు మరియు యవ్వన దశలో ఉన్న అమ్మాయిలలో రక్తహీనత కేసులను క్షీణింపచేయడానికీ, చిన్నారులను ఎదగనీయకుండా ఉంచే ధోరణి ని న్యూనీకరించడానికి ఈ కార్యక్రమం పాటుపడనుంది.