ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ న ఝాంసీ ని సందర్శించనున్నారు. ఆయన ఝాంసీ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించడమో లేదా పునాదిరాళ్లు వేయడమో చేయనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాంసీ లో డిఫెన్స్ కారిడార్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ సంబంధిత ఉత్పత్తుల లో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసేందుకు గాను దేశం లో రెండు డిఫెన్స్ కారిడార్ లను ఏర్పాటు చేయాలని, వాటి లో ఒక దాని ని తమిళ నాడు లో, మరొక దాని ని ఉత్తర్ ప్రదేశ్ లో నెలకొల్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటయ్యే డిఫెన్స్ కారిడార్ యొక్క 6 నోడల్ పాయింట్ లలో ఒక పాయింట్ గా ఝాంసీ ఉంటుంది. అటువంటి ఒక కారిడార్ ను బుందేల్ ఖండ్ ప్రాంతం లో నెలకొల్పనున్నట్లు ప్రధాన మంత్రి 2018వ సంవత్సరం ఫిబ్రవరి నెల లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ పెట్టుబడిదారుల సమావేశం లో ప్రకటించారు.
శ్రీ మోదీ 297 కిలో మీటర్ల పొడవైన ఝాంసీ- ఖైరార్ రైల్ సెక్షన్ లో విద్యుదీకరణ పూర్తి అయిన మార్గాన్ని ప్రారంభించనున్నారు. దీని తో రైళ్ళ రాక పోక లు వేగవంతం అవుతాయి. అంతే కాదు, కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. పర్యావరణం నిలకడగా ఉండటానికి సైతం ఇది దోహదం చేయనుంది.
ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాని కి అంతరాయం తలెత్తని విధం గా విద్యుత్తు సరఫరా కై ఉద్దేశించినటువంటి వెస్ట్- నార్త్ ఇంటర్-రీజియన్ పవర్ ట్రాన్స్‌మిశన్ స్ట్రెన్ థనింగ్ ప్రోజెక్టు ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.
ప్రధాన మంత్రి పహాడీ ఆనకట్ట ఆధునికీకరణ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ ఆనకట్ట ను ఝాంసీ జిల్లా లో ధసాన్ నది మీద నిర్మించడం జరిగింది.
అందరికీ త్రాగునీటి ని అందించాలన్న ప్రభుత్వ దార్శనికత కు అనుగుణం గా బుందేల్ ఖండ్ ప్రాంతం లో గ్రామాల కు గొట్టపు మార్గం ద్వారా నీటి ని సరఫరా చేసేందుకు తలపెట్టిన ఒక ఫథకాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రోజెక్టు దుర్భిక్షం బారిన పడ్డ బుందేల్ ఖండ్ ప్రాంతాని కి నీటి సరఫరా కై ఉద్దేశించింది. ప్రధాన మంత్రి ఎఎమ్ఆర్ యుటి (‘అమృత్’) లో భాగం గా ఝాంసీ నగర త్రాగునీటి సరఫరా పథకం యొక్క రెండో దశ కు పునాదిరాయి ని కూడా వేయనున్నారు.
ఝాంసీ లో పాత రైలు పెట్టెల ను నవీకరించే ఒక వర్క్‌షాప్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది బుందేల్ ఖండ్ ప్రాంతం లో ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
ఝాంసీ-మాణిక్‌పుర్ మరియు భీమసేన్-ఖైరార్ సెక్షన్ లో 425 కిలో మీటర్ల పొడవైన రైలు మార్గాల డబ్లింగ్ పథకాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులు పూర్తి అయ్యాయంటే రైళ్ళు సులభం గా రాక పోక లు సులభతరం కావడం తో పాటు బుందేల్ ఖండ్ ప్రాంతం సర్వతోముఖ వికాసాని కి తోడ్పాటు కూడా లభించగలదు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంతకుముందు ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ ని సందర్శించారు. అంతేకాక వృందావన్ ను కూడా ఆయన సందర్శించి, తక్కువ సౌకర్యాల కు మాత్రమే నోచుకొంటున్న బాలల కు మూడు వందల కోట్లవ భోజనాన్ని వడ్డించారు.