ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పుర్ లో మంగళవారం నాడు పర్యటించనున్నారు.
బిలాస్‌పుర్ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 750 పడకలతో ఉండే ఈ ఆసుపత్రి ని సుమారు రూ. 1350 కోట్ల తో నిర్మిస్తారు. ఇక్కడ ఆరోగ్య సంరక్షణతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి లలో వైద్య విద్యను బోధించడమే కాకుండా నర్సింగ్ లో కూడా విద్యాబోధన జరుగనుంది.
ఊనా లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి)కి ప్రధాన మంత్రి పునాదిరాయిని వేస్తారు.
కాంగ్ డా లోని కంద్ రోడీ లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎఐఎల్)కు చెందిన ఒక స్టీల్ ప్రాసెసింగ్ యూనిట్ ను శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
ఆ తరువాత ఆయన ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.