ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జనవరి 19వ తేదీన సూరత్ లోని హజీరా సందర్శించనున్నారు.
హజీరాలో ఆయన ఎల్ అండ్ టి ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను సందర్శించి దాన్ని జాతికి అంకితం చేసినందుకు గుర్తుగా ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే నవసారిలో నిరాలీ కేన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు.
అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్న ఈ కేన్సర్ ఆస్పత్రి నవసారిలోనే సమగ్ర సేవలందించగల కేన్సర్ ఆస్పత్రి. దక్షిణ గుజరాత్, సమీపంలోని రాష్ర్టాల కేన్సర్ రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రధానమంత్రి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తున్నారు, శనివారం ఆయన పర్యటన చివరి రోజు.
తొలి రోజు పర్యటనలో ఆయన గాంధీనగర్ లో వైబ్రంట్ గుజరాత్ ట్రేడ్ షోను ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, అహ్మదాబాద్ షాపింగ్ ఫెస్టివల్ రెండింటినీ ప్రారంభిస్తారు. అలాగే గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ లో 9వ వైబ్రంట్ గుజరాత్ సదస్సును కూడా ప్రారంభిస్తారు.
I shall be visiting Hazira tomorrow. I would be dedicating L&T’s Armoured Systems Complex to the nation and also be laying the foundation stone for the Nirali Cancer hospital at Navsari.
— Narendra Modi (@narendramodi) January 18, 2019