ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ న రోహ్‌తక్ లోని సాంప్లా ను సందర్శించనున్నారు.
ఆయన దీనబంధు సర్ చోటూ రామ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సర్ చోటూ రామ్ గారు ఒక ప్రముఖ నాయకులు. రైతుల సంక్షేమం, వెనుకబడిన వర్గాలు మరియు అణగారిన వర్గాల విముక్తి కోసం ఆయన అవిశ్రాంతం గా కృషి చేశారు. అలాగే విద్య రంగం లో, ఇతర సామాజిక ఆశయాల కోసం ఆయన చేసిన కృషి స్మరణీయమైంది.
ప్రధాన మంత్రి జన సభ లో పాలుపంచుకొని సోనెపట్ లో రైలు పెట్టెల మరమ్మతు కర్మాగారానికి శంకుస్థాపన సూచకంగా ఓ ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఒకసారి ఇది పూర్తి అయిందంటే గనుక ఉత్తర భారతదేశం లో రైలు పెట్టెలను మరమ్మతు చేసే మరియు నిర్వహణ కు దోహదం చేసే ఒక ప్రధాన కేంద్రం గా రూపొందగలుగుతుంది. దీనిని మోడ్యులర్, ఇంకా ప్రి ఫ్యాబ్రికేటెడ్ కన్‌స్ట్రక్షన్ టెక్నిక్ లు, పర్యావరణ హితకరమైన రీతులు మరియు ఆధునిక యంత్ర సామగ్రి ని ఉపయోగించి నెలకొల్పనున్నారు.