ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ నాడు గుజరాత్ లో పర్యటించనున్నారు.
ప్రధాన మంత్రి అమూల్ కు చెందిన అత్యాధునిక చాక్‌లెట్ ప్లాంటు ను మరియు అత్యాధునికమైన ఫూడ్ ప్రాసెంసింగ్ సదుపాయాలను ఆణంద్ లో ప్రారంభించనున్నారు. అలాగే ఆణంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి చెందిన ఇంక్యుబేశన్ సెంటర్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఫూడ్ ప్రాసెసింగ్ ను మరియు ముజ్‌కువా గ్రామం లో ఒక సౌర శక్తి సంబంధిత సహకార సంఘాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆణంద్ లో, ఇంకా ఖత్ రాజ్ లో అమూల్ తయారీ సదుపాయాల విస్తరణ పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన ను కూడా చేస్తారు. అక్కడకు తరలివచ్చే జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఆ తరువాత ప్రధాన మంత్రి అంజార్ కు ప్రయాణమవుతారు. ఆయన ముంద్రా ఎల్ఎన్‌జి టర్మినల్, అంజర్- ముంద్రా గొట్టపు మార్గం పథకం లతో పాటు, పాలన్ పుర్-పాలీ-బాడ్ మేర్ గొట్టపు మార్గం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడకు విచ్చేసే సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
అనంతరం ప్రధాన మంత్రి రాజ్‌కోట్ కు చేరుకొంటారు. అక్కడ మహాత్మ గాంధీ వస్తు ప్రదర్శన శాల ను ఆయన ప్రాంభిస్తారు. మహాత్మ గాంధీ తొలి నాళ్ళ లో ఒక ముఖ్య పాత్రను వహించిన రాజ్‌కోట్ లోని ఆల్‌ఫ్రెడ్ హైస్కూలు లో ఈ మ్యూజియమ్ ను ఏర్పాటు చేయడమైంది. ఇది గాంధేయ వాదాన్ని, గాంధేయ విలువలను, సంస్కృతి ని గురించి చైతన్యాన్ని వ్యాప్తి చేయడం లో దోహదపడనుంది. ప్రధాన మంత్రి 624 గృహాల తో కూడిన ఒక ప్రజా గృహ నిర్మాణ పథకాని కి ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 240 లబ్ధిదారుల ‘ఇ-గృహ ప్రవేశ్’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు.
ప్రధాన మంత్రి న్యూ ఢిల్లీ కి బయలుదేరి వెళ్ళే ముందు మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను సందర్శిస్తారు.