ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ నాడు పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపుర్ ను సందర్శించనున్నారు.
ఈ సందర్భం గా ఆయన అణ్డాల్- సాయింథియా- పాకుడ్-మాల్దా మరియు ఖానా-సాయింథియా సెక్షన్ లలో 294 కిలో మీటర్ల పొడవున పూర్తి అయిన విద్యుదీకరించిన రైలు మార్గాన్ని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ సెక్షన్ విద్యుదీకరణ ఫలితం గా ఉత్తర భారతదేశాని కి, అలాగే ఈశాన్య భారతావని కి బొగ్గు ను, కంకర రాళ్ల ను అంతరాయం ఉండని విధంగా రవాణా చేయడం సులభతరం కానుంది.
ఆయన ఇరవై కిలో మీటర్ల పొడవున్న హిజ్ లీ-నారాయణ్‌గఢ్ మూడో లైను ను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు.