ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం జనవరి 9 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా ను సందర్శించనున్నారు. ఆయన గంగాజల్ పథకాన్ని, ఇతర వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆగ్రా స్మార్ట్ సిటీ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు మరియు ఎస్ఎన్ మెడికల్ కాలేజి స్థాయి పెంపు పనుల కు, ఇంకా అన్య పథకాల కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
గంగాజల్ కార్యక్రమం ప్రాజెక్టు వ్యయం 2,880 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఈ పథకం ఆగ్రా కు మరింత మెరుగైనటువంటి, భరోసా ను ఇచ్చేటటువంటి నీటి సరఫరా కు తోడ్పడనుంది. ఇది నగర నివాసుల తో పాటు యాత్రికులకు కూడా ప్రయోజనకారి గా ఉంటుంది. ఆగ్రా లో ఎస్ఎన్ మెడికల్ కాలేజి స్థాయి పెంపు నకు 200 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ పనుల లో భాగం గా మహిళల ఆసుపత్రి లో 100 పడకల తో ప్రసూతి విభాగాన్ని సైతం నెలకొల్పనున్నారు. ఇది సమాజం లో బలహీన వర్గాల కు మాతృత్వ సంరక్షణ ను, మెరుగైన ఆరోగ్యాన్ని అందజేయడం లో సహాయకారి గా ఉంటుంది. ఆగ్రా స్మార్ట్ సిటీ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను 285 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో ఏర్పాటు చేయనున్నారు. ఇది ఆగ్రా ను ఒక ఆధునిక ప్రపంచ శ్రేణి స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్ది ఆ నగరాన్ని ఒక ప్రధానమైనటు వంటి యాత్రా స్థలం గా రూపొందించడం లో సహాయపడనుంది.
ఆగ్రా లోని కోఠీ మీనా బజార్ ప్రాంతం లో ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
ప్రధాన మంత్రి తరలి రావడం ఈ నగరానికి ఇది రెండో సారి. ఇంతకు ముందు 2016వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ న ఇక్కడకు ఆయన విచ్చేసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్)ను ప్రారంభించారు. ఈ పథకం లో భాగం గా ఇంతవరకు 65 లక్షల గృహాల ను నిర్మించడం జరిగింది. వీటి లో 9.2 లక్షల గృహాల ను ఉత్తర్ ప్రదేశ్ లో నిర్మించడమైంది. ఈ ప్రాంతాని కి ప్రత్యేకించి రైల్వేల సంబంధిత మౌలిక సదుపాయాలను, ఇంకా సేవల ను సైతం ప్రధాన మంత్రి ప్రారంభించారు.