ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐక్య రాజ్య సమితి ప్రదానం చేసే పర్యావరణ రంగం సంబంధిత అత్యున్నత పురస్కారం ‘యుఎన్ఇపి చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్’ అవార్డు ను న్యూ ఢిల్లీ లోని ప్రవాసీ భారతీయ కేంద్రం లో అక్టోబర్ 3వ తేదీ నాడు నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం లో అందుకోనున్నారు. న్యూ యార్క్ సిటీ లో సెప్టెంబర్ 26వ తేదీ నాడు జరిగిన 73వ యుఎన్ జనరల్ అసెంబ్లీ లో ప్రకటించిన ఈ అవార్డు ను ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ కు సారధ్యం వహించడం లో మార్గదర్శకమైన కృషి ని చేసినందుకు మరియు భారతదేశం లో ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ నంతటినీ 2022 వ సంవత్సరం కల్లా నిర్మూలించాలన్న అపూర్వమైన ప్రతిన ను స్వీకరించినందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ని నాయకత్వ కేటగిరీ లో ఎంపిక చేయడమైంది.
ప్రభుత్వం లో, పౌర సమాజం లో మరియు ప్రైవేటు రంగంలో పర్యావరణం పై ఒక సానుకూలమైనటు వంటి ప్రభావాన్ని ప్రసరించినటువంటి పనులను చేసిన అసాధారణ నేతల కు ఏటా ‘చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్’ బహుమతి ని ఇస్తూ వస్తున్నారు.