ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్‌నేశనల్ కన్వెన్షన్ & ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) కి 2018వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ఆయన ఈ కార్యక్రమం లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ద్వారక లోని సెక్టర్ 25 లో నెలకొనే ఈ కేంద్రం ఆర్థిక సేవలు, ఆతిథ్య సంబంధిత సేవలు, ఇంకా రిటైల్ సర్వీసు లతో కూడిన ఒక ప్రపంచ శ్రేణి అత్యధునాతన ప్రదర్శన మరియు సమావేశ కేంద్రం గా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 25,700 కోట్ల రూపాయలు గా ఉంటుంది.
వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధి లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ & ప్రమోశన్ ఆధ్వర్యం లో 100 శాతం ప్రభుత్వ యాజమాన్యం తో కూడిన కంపెనీ గా ఏర్పాటయ్యే ఇండియా ఇంటర్‌నేశనల్ కన్వెన్షన్ & ఎగ్జిబిశన్ సెంటర్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు ను అమలుచేయనుంది.