గాంధీ మహాత్ముడు తాను ప్రారంభించిన సత్యాగ్రహంలో తొలి ప్రయోగాన్ని చంపారణ్ లో చేపట్టి 100 సంవత్సరాలయిన సందర్భంగా దేశ రాజధాని నగరంలో “స్వచ్ఛాగ్రహ- బాపు కో కార్యాంజలి - ఏక్ అభియాన్, ఏక్ ప్రదర్శని” పేరుతో ఏర్పాటైన ఓ ప్రదర్శనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమంలో ఒక ‘ఆన్ లైన్ ఇంటరాక్టివ్ క్విజ్’ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ క్విజ్ ను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని గురించి తన అభిప్రాయాలను ట్విటర్ లో పంచుకొన్నారు. చంపారణ్ సత్యాగ్రహం చరిత్రాత్మకమైన ప్రజాందోళన అని, అది గొప్ప ప్రభావాన్ని కనబరచిందని, దేశ ప్రజలు స్వచ్ఛాగ్రహులుగా మారి, ఒక స్వచ్ఛ భారతాన్ని ఆవిష్కరించాలని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“రేపు నేను చాలా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంలో భాగస్వామినవుతున్నాను. ఆ కార్యక్రమమే ‘స్వచ్ఛాగ్రహ- బాపు కో కార్యాంజలి’. చరిత్రాత్మకమైన చంపారణ్ సత్యాగ్రహం ఆరంభమై 100 సంవత్సరాలయిన సందర్భంగా- ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా- చంపారణ్ సత్యాగ్రహాన్ని కళ్లకు కడుతూ ఒక ప్రదర్శన ఉంటుంది. అది- సత్యాగ్రహం యొక్క, స్వచ్ఛాగ్రహం యొక్క అతి ప్రధానమైన నియమాలను చాటుతుంది.
అలాగే, పరిశుభ్ర భారతదేశం దిశగా సాగుతున్న ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ఇంతవరకు సాధించిన పురోగతిని కూడా ఆ ఎగ్జిబిషన్ చాటిచెప్తుంది.
ఒక శతాబ్దం కిందట భారతీయులు సత్యాగ్రహులుగా మారి, వలసవాదంపైన పోరాడారు. ఇవాళ మనమందరం స్వచ్ఛాగ్రహులమవుదాం, స్వచ్ఛ భారతాన్ని మనం సృష్టిద్దాం.
బాపూ నాయకత్వం వహించిన ఒక చరిత్రాత్మకమైన ప్రజాందోళన కార్యక్రమమే చంపారణ్ సత్యాగ్రహం. దాని ప్రభావం అసాధారణం” అని ప్రధాన మంత్రి అన్నారు.
Tomorrow I will join a very special programme, 'Swachhagraha - Bapu Ko Karyanjali' to mark 100 years of the historic Champaran Satyagraha.
— Narendra Modi (@narendramodi) April 9, 2017
There will be an exhibition showcasing Champaran Satyagraha & it will connect essential principles of Satyagraha with Swachhagraha. pic.twitter.com/qhDLsY6XKl
— Narendra Modi (@narendramodi) April 9, 2017
The exhibition will also showcase the ground covered by the Swachh Bharat Mission in creating a mass movement towards a clean India.
— Narendra Modi (@narendramodi) April 9, 2017
A century ago, Indians became Satyagrahis & fought colonialism. Today, let us become Swachhagrahis & create a Swachh Bharat, #MyCleanIndia
— Narendra Modi (@narendramodi) April 9, 2017
Champaran Satyagraha was a historic mass movement led by Bapu. Its impact was phenomenal. https://t.co/8lj84DYVsy
— Narendra Modi (@narendramodi) April 9, 2017