సిక్కింలో పాక్యాంగ్ విమానాశ్రయాన్నీ ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(పిఎంజెఎ) పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న
ప్రారంభిస్తారు. ఈ పథకం కింద పది కోట్ల కుటుంబాలకు ఏటా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య రక్షణ కల్పిస్తారు.
ప్రధానమంత్రి పి.ఎం.జె.ఎ.వై ప్రదర్శనను తిలకిస్తారు. లబ్ధిదారుల గుర్తింపు, ఈ కార్డ్ తయారీ వంటివాటి ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి తిలకిస్తారు. ఆ కార్యక్రమంలోనే ప్రధానమంత్రి చాయిబాసా, కొడెర్మలలో వైద్యకళాశాలల ఏర్పాటుకు ప్రధానమంత్రి
శంకుస్థాపన చేస్తారు.
పది హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సిక్కింలోని గ్యాంగ్‌టాక్ వెళ్లడానికి ముందు ఆయన
బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సెప్టెంబర్ 24న ప్రధానమంత్రి సక్కింలోని పక్యాంగ్ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. దీనితో సిక్కిం రాష్ట్రం విమానయాన పటంలో స్థానం సంపాదించుకుంటుంది. ఈ విమానాశ్రయం సిక్కింను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి వీలు కల్పిస్తుంది.
పర్యాటక రంగ అభివృద్ధికి ఈ విమానాశ్రయం వీలుకల్పించనుంది. ప్రధానమంత్రి పక్యాంగ్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడ ఆయనకు విమానాశ్రయం,టెర్మినల్ భవనాల గురించి వివరిస్తారు. పక్యాంగ్ విమానాశ్రయం ప్రారంభానికి సూచికగా ఏర్పాటు చేసిన ఫలకాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.