రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే కృషి లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశు గణం లో గాలి కుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి) మరియు బ్రుసెలోసిస్ ను అరికట్టేందుకు సెప్టెంబర్ 11వ తేదీ నుండి జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమం (ఎన్ఎడిసిపి)ని ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో ప్రారంభించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి 100 శాతం నిధుల అండ తో, 2024వ సంవత్సరం వరకు అయిదు సంవత్సరాల కాలం లో 12,652 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం కోసం వెచ్చిస్తారు. ఈ కార్యక్రమం లో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులు సహా 500 మిలియన్ కు పైగా పశుగణాని కి ఎఫ్ఎమ్ డి సోకకుండా ఉండేందుకు టీకాలు వేయించాలని లక్ష్యం గా పెట్టుకొన్నారు.
అలాగే, ఈ కార్యక్రమం లో ఏటా 36 మిలియన్ పాలిచ్చే ఆవు లకు చెందిన దూడల కు బ్రుసెలోసిస్ రోగం సోకకుండా టీకాలు వేయిస్తారు.
ఈ కార్యక్రమం లో రెండు అంశాలు ఉంటాయి. అవి.. 2025వ సంవత్సరాని కల్లా ఈ రోగాల ను నియంత్రించడం మరియు 2030వ సంవత్సరాని కల్లా ఈ రోగాల ను పారదోలడమూను.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ కృత్రిమ వీర్య నిక్షేపణం కార్యక్రమాన్ని కూడా అదే రోజు న ప్రారంభిస్తారు.
అంతే కాక, టీకాలు వేయడం, రోగ నిర్వహణ, కృత్రిమ వీర్య నిక్షేపణం మరియు ఉత్పాదకత అంశాల పై దేశం లోని 687 కృషి విజ్ఞాన కేంద్రాల లో ఏక కాలం లో వర్క్ షాప్ ల ను కూడా ప్రారంభించే ఆస్కారం ఉందని ఆశించడమైంది.
సెప్టెంబర్ 11వ తేదీ న ప్రధాన మంత్రి మథుర సందర్శన కాలం లో, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం లో సైతం పాలు పంచుకోనున్నారు.