జోగ్ బనీ- బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి) ని నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. ఓలీ తో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న సంయుక్తం గా ప్రారంభించనున్నారు. భారతదేశం- నేపాల్ సరిహద్దు వెంబడి ప్రజల రాక పోకల కు తోడు పరస్పర వ్యాపారం సౌలభ్యం గా ఉండేందుకు జోగ్ బనీ- బిరాట్ నగర్ లో రెండో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను భారతదేశ ఆర్థిక సహాయం తో నిర్మించడం జరిగింది.
భారత ప్రభుత్వ సహాయం తో నేపాల్ లో చేపట్టిన భూకంప అనంతర గృహ పునర్ నిర్మాణ పథకాల లో అసాధారణ పురోగతి ని కూడా ప్రధానులు ఉభయులూ వీక్షించనున్నారు. గూర్ఖా మరియు నువాకోట్ జిల్లాల లో 50,000 ఇళ్ల ను నిర్మించడం అనేది భారత ప్రభుత్వం చేసిన వాగ్దానం కాగా అందులో 45,000 గృహాల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేయడమైంది.
Tomorrow PM @narendramodi and @PM_Nepal Shri K.P. Oli will jointly inaugurate the second Integrated Check Post (ICP) at Jogbani-Biratnagar built with Indian assistance to facilitate trade and people’s movement.
— PMO India (@PMOIndia) January 20, 2020
The first ICP was built in Raxaul-Birgunj in 2018.
Both Prime Ministers will also witness the remarkable progress in GoI assisted post-earthquake housing reconstruction projects in Nepal.
— PMO India (@PMOIndia) January 20, 2020
Out of GoI’s commitment to build 50,000 houses in Gorkha and Nuwakot districts, 45,000 have already been completed.