ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘పరీక్షా పే చర్చ 2020’’ కార్యక్రమం లో భాగం గా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రుల తో 2020వ సంవత్సరం జనవరి 20వ తేదీ న సంభాషించనున్నారు. పాఠశాల విద్యార్థుల తో ప్రధాన మంత్రి సంభాషించే ‘‘పరీక్షా పే చర్చ 2020’’ కార్యక్రమం యొక్క మూడో భాగాన్ని న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో 2020వ సంవత్సరం జనవరి 20వ తేదీ నిర్వహించాలని ప్రతిపాదించడమైంది. ఈ కార్యక్రమాని కై ఎంపిక చేసిన విద్యార్థుల తో వారు పరీక్షల తాలూకు ఒత్తిడి ని ఎలాగ అధిగమించబోతున్నారన్న అంశం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించనున్నారు. వారు అడిగే ప్రశ్నల కు ఆయన సమాధానాల ను కూడా ఇవ్వనున్నారు.
అనుపమానమైనటువంటి ఈ కార్యక్రమం లో కేవలం పాలుపంచుకోవడం తో సరిపెట్టుకోకుండా ప్రధాన మంత్రి వద్ద నుండి విలువైన చిట్కాల ను అందుకోవడం పట్ల కూడా విద్యార్థుల లో, ఉపాధ్యాయుల లో మరియు తల్లితండ్రుల లో బోలెడంత ఉత్తేజం మరియు ఉత్సాహం వ్యక్తమవుతోంది. విద్యార్థులు ఒక ఆనందకర వాతావరణం లో పరీక్షలు వ్రాయాలని, వారు దీర్ఘ కాలం లో ఉత్తమ ఫలితాల ను పొందాలి అంటే పరీక్షలను ఒక పెద్ద భారం గా వారు భావించకుండా చూడాలని ప్రధాన మంత్రి ఉత్సుకత తో ఉన్నారు.
పాఠశాల విద్యార్థుల తో మరియు కళాశాల విద్యార్థుల తో ప్రధాన మంత్రి సంభాషణ కార్యక్రమమైన ‘‘పరీక్షా పే చర్చ 1.0’’ (ఒకటో సంచిక)ను న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో 2018వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న నిర్వహించడమైంది. ఇదే విధం గా రెండో సంచిక ను ‘‘పరీక్షా పే చర్చ 2.0’’ పేరు తో న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లోనే 2019వ సంవత్సరం జనవరి 29వ తేదీ న జరిపారు.
11 AM, 20th January...
— Narendra Modi (@narendramodi) January 19, 2020
We will once again have extensive discussions and insightful conversations on a wide range of subjects relating to examinations, especially how to remain happy as well as stress free during exam season.
Inviting you all to join ‘Pariksha Pe Charcha 2020’!
In the run up to ‘Pariksha Pe Charcha 2020’, lakhs of students, parents and teachers shared their inputs and suggestions. These are extremely valuable, giving insights into the pressing issues when it comes to exam preparation, the exam itself and the time after examinations.
— Narendra Modi (@narendramodi) January 19, 2020
Discussion on exams, @examwarriors and the ‘Pariksha Pe Charcha’ are a part of an endeavour to support our dynamic students and assure them that we are all with them as they prepare for their exams.
— Narendra Modi (@narendramodi) January 19, 2020
See you tomorrow at PPC 2020!