ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 వ సంవత్సరం అక్టోబర్ 24 వ తేదీ నాడు “మై నహీ హమ్” పోర్టల్, ఇంకా యాప్ ప్రారంభం కానున్న సందర్భంగా దేశం నలు మూలలా ఉన్న ఐటి వృత్తి నిపుణుల తోను, ఇలెక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ వృత్తి నిపుణుల తోను సంభాషించనున్నారు.
“Self4Society” ఇతివృత్తం ప్రాతిపదిక గా పని చేసే ఈ పోర్టల్ ఐటి వృత్తి నిపుణుల కు మరియు సంస్థ లకు సామాజిక అంశాల దిశ గా ఉమ్మడి కృషి చేసేందుకు, అలాగే సమాజానికి సేవ చేసేందుకు కూడా ఒక వేదిక ను సమకూర్చనుంది. తత్ఫలితంగా ప్రత్యేకించి సాంకేతిక విజ్ఞానం తాలూకు ప్రయోజనాల ను వినియోగించుకొంటూ సమాజం లో దుర్భల వర్గాల కు సేవ చేసేందుకు మరింత ఎక్కువ సమన్వయాన్ని ఇది అందించగలదని ఆశిస్తున్నారు. అంతేకాకుండా, సమాజ హితం కోసం పని చేయాలని తపిస్తున్న వ్యక్తులు మరింత మంది ఈ పని లో పాలుపంచుకొనేందుకు కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు.
పరిశ్రమ కు చెందిన కీలకమైన నేతల తో ప్రధాన మంత్రి సమావేశం కానున్నారు. ఆయన ఐటి వృత్తి నిపుణులు, ఐటి ఉద్యోగుల తో పాటు, ఇలెక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ ల ప్రతినిధుల తో కూడిన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన సభికుల ను ఉద్దేశించి ఒక సమావేశ మందిరం లో మాట్లాడే తరహా లో సంభాషించనున్నారు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు వంద ప్రదేశాల నుండి ఐటి వృత్తి నిపుణులతో పాటు ఇలెక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సంబంధిత వృత్తి నిపుణులు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే అవకాశం ఉంది.