ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 14వ తేదీ నాడు ఉదయం 11 గంటల వేళ కు ‘ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని’ ప్రారంభించనున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కాలం లో, ఈ సంగ్రహాలయాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన అనంతర కాలం లో మన ప్రధాన మంత్రుల జీవనం మరియు వారి యొక్క తోడ్పాటు అనే మాధ్యమం ద్వారా లిఖితం అయిన భారతదేశ గాథ ను ఈ మ్యూజియమ్ వివరిస్తుంది.
దేశ నిర్మాణం దిశ లో పాటుపడ్డ భారతదేశాని కి చెందిన ప్రధాన మంత్రులు అందరి తోడ్పాటుల ను గౌరవించాలి అన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదర్శిత్వాని కి అనుగుణం గా రూపుదిద్దుకొన్న ఈ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ స్వాతంత్య్ర అనంతరం కాలం లో భారతదేశం యొక్క ప్రతి ప్రధాన మంత్రి కి.. వారు ఏ విధమైనటువంటి సిద్ధాంతాల ను అనుసరించారు, లేదా ఎంత కాలం పాటు అధికారం లో ఉన్నారు అనేటువంటి విషయాల కు అతీతం గా.. వారికి సమర్పించిన ఒక శ్రద్దాంజలి గా రూపొందింది. ఇది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో ఒనగూరినటువంటి ఒక ఏకీకృత ప్రయాస గా ఉన్నది. మన ప్రధాన మంత్రులందరి నేతృత్వ లక్షణాలను, వారి దార్శనికత ను మరియు వారు సాధించిన విజయాల ను మన యువ తరానికి చాటిచెప్తూ, యువ తరాని కి ప్రేరణ ను అందించాలి అనేదే ఈ సంగ్రహాలయం స్థాపన లోని ఉద్దేశ్యం గా ఉంది.
పాత మరియు కొత్త ల సహజ మిశ్రణాని కి ప్రతీక గా ఉండే ఈ సంగ్రహాలయం లో ఇదివరకటి తీన్ మూర్తి భవన్ ను ఒకటో బ్లాకు గాను, కొత్త గా నిర్మించిన భవనాన్ని రెండో బ్లాకు గాను కలిపివేయడం జరిగింది. రెండు బ్లాకు ల మొత్తం విస్తీర్ణం 15,600 చదరపు మీటర్ ల కంటే ఎక్కువ గా ఉంది.
వృద్ధి లోకి వస్తున్న భారతదేశం యొక్క గాథ నుంచి ప్రేరణ ను పొంది, సంగ్రహాలయం భవనం ఆకృతి ని రూపొందించడం జరిగింది; అటువంటి దేశాని కి దాని నేత లు తమ చేతుల మీదు గా ఆకారాన్ని ఇచ్చి మలచారు. డిజైను లో దీర్ఘకాలికమైనటువంటి మరియు శక్తి ని ఆదా చేసేటటువంటి సాంకేతికత ను జోడించడమైంది. ఈ ప్రాజెక్టు ను మలచే క్రమం లో ఏ ఒక్క వృక్షాన్ని నరికివేయడం గాని, లేదా మరో చోటు కు తీసుకు పోయి నాటడం గాని జరుగలేదు. దేశాని కి మరియు ప్రజాస్వామ్యాని కి ప్రతీక అయిన ధర్మ చక్రాన్ని పట్టుకొన్న భారతదేశ ప్రజల హస్తాల ను ఈ సంగ్రహాలయం యొక్క గుర్తింపు చిహ్నం సూచిస్తుంది.
ఈ మ్యూజియమ్ కోసం అవసరమైన సమాచారాన్ని ప్రసార భారతి, దూర్ దర్శన్, ఫిల్మ్ స్ డివిజన్, సంసద్ టీవీ, రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రసార మాధ్యమాల రంగ సంస్థ లు (భారతీయ మరియు విదేశీ), విదేశీ సమాచార ఏజెన్సీ లు మొదలైన సంస్థల యొక్క వనరులు/సంచయాల మాధ్యమం ద్వారా సేకరించడం జరిగింది. ప్రాచీన భాండాగారాల ను (సంగ్రహించిన కార్యాలు, ఇతర సాహిత్య రచన లు, ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాల విషయం లో) సముచిత రీతి న ఉపయోగించుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగత వస్తువులు, సమ్మానాలు, ప్రదానం చేసిన పతకాలు, స్మారక తపాలా బిళ్ళ లు, నాణేలు, వంటివి), ప్రధాన మంత్రులు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ఉపాఖ్యానంతో కూడిన ప్రతినిధిత్వాలు, ఇంకా ప్రధాన మంత్రుల జీవనం లోని విభిన్న పార్శ్వాలను ఒక ఇతివృత్తం వలె ఇక్కడ ప్రదర్శన కు ఉంచడం జరిగింది.
సంగ్రహాలయం లో ఉంచిన విషయ వివరణ వస్తువుల లో వివిధత్వం మరియు వాటి ప్రదర్శన పరం గా నిరంతర ప్రాతిపదిక న కొత్త వన్నెల ను సంతరించడం కోసం అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాధారిత ఇంటర్ ఫేస్ ను జతపరచడమైంది. హోలో గ్రాము లు, వర్చువల్ రియాలిటీ, ఆగ్ మెంటెడ్ రియాలిటీ, మల్టి-టచ్, మల్టీమీడియా, ఇంటరేక్టివ్ కియోస్క్, కంప్యూటర్ లో కదిలే శిల్పాలు, స్మార్ట్ ఫోన్ ఎప్లికేశన్ , ఇంటరేక్టివ్ స్క్రీన్ లు, అనుభవాత్మకమైన ఇన్ స్టాలేశన్ లు మొదలైనవి ప్రదర్శన సామగ్రి ని అత్యధిక భాగం సంభాషణాత్మకం గాను మరియు ఆకర్షణీయమైన రూపం తోను తీర్చిదిద్దుతున్నాయి అని చెప్పాలి.
సంగ్రహాలయం లో మొత్తం 43 ప్రదర్శనశాల లు ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటాని కి సంబంధించిన ప్రదర్శన తో మొదలై రాజ్యాంగం రూపకల్పన వరకు ఈ సంగ్రహాలయం మన ప్రధాన మంత్రులు వివిధ సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడాను దేశానికి ఏ విధం గా కొత్త దారి ని చూపారు మరియు దేశం అన్ని రంగాల లో ప్రగతి చెందేందుకు కృషి చేశారు అనే విషయాల ను వివరిస్తుంది.