రాజధాని నగరం లోని మునీర్ కా లో కేంద్రీయ సమాచార సంఘం (సిఐసి) నూతన ప్రాంగణాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ నూతన భవనం ఒకే ప్రదేశం నుండి సిఐసి విధులు నిర్వహించేందుకు మార్గాన్ని సుగమం చేయనుంది. అంతక్రితం, కిరాయికి తీసుకొన్న రెండు భవనాల నుండి సిఐసి పనిచేస్తూ వచ్చింది. సిఐసి కొత్త భవన నిర్మాణాన్ని నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తి చేసింది. ఇది ఒక అత్యధునాతనమైన హరిత ప్రమాణాలతో కూడిన భవనం. అయిదు అంతస్తులు ఉన్న ఈ భవనంలో ఆధునిక ఐటీ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలతో తీర్చిదిద్దిన హియరింగ్ రూమ్స్ ఉన్నాయి. సిఐసి 2005 నాటి సమాచార హక్కు చట్టం పరిధిలో ఏర్పాటు చేసిన అత్యున్నత అపీలు సంఘం.