బిహార్ లో పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన కు చెందిన ఏడు ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 15న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. వీటిలో నాలుగు ప్రాజెక్టులు నీటి సరఫరాకు సంబంధించినవి, రెండు ప్రాజెక్టులు మురుగునీటి శుద్ధి, ఒక ప్రాజెక్టు నదీ ముఖం అభివృద్ధికి సంబంధించినవి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం 541 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల అమలు బాధ్యత ను బిహార్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ విభాగానికి చెందిన బియుఐడిసిఒ చేపట్టింది. ఈ కార్యక్రమం లో బిహార్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొంటారు.
వివరాలు
పట్నా పురపాలిక సంస్థ పరిధి లోని బెవుర్ లోను, కరమలీచక్ లోను నమామి గంగె పథకం లో భాగం గా నిర్మాణం జరిగిన మురుగునీటి శుద్ధి ప్లాంటుల ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.
సీవాన్ పురపాలక మండలి, ఛప్రా నగరపాలక సంస్థ లలో ఎఎంఆర్ యుటి (అమృత్) మిషన్ లో భాగం గా నిర్మించిన నీటి సరఫరా పథకాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల ప్రజల కు ప్రతి రోజూ శుభ్రమైన త్రాగునీటిని అందించనున్నాయి.
ప్రధాన మంత్రి ముంగేర్ నీటి సరఫరా పథకానికి శంకు స్థాపన చేస్తారు. ఈ పథకం ముంగేర్ నగరపాలిక సంస్థ నివాసులకు గొట్టపు మార్గాల ద్వారా శుభ్రమైన నీటిని అందించడం లో తోడ్పడనుంది. జమాల్‌పుర్ పురపాలిక మండలి లో జమాల్‌పుర్ నీటి సరఫరా పథకానికి కూడా శంకుస్థాపన జరగనుంది.
నమామి గంగే లో భాగం గా నిర్మాణం లో ఉన్న ముజఫర్‌పుర్ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ స్కీమ్ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు లో భాగం గా ముజఫర్‌పుర్ లో.. పూర్వీ అఖాడా ఘాట్, సీధీ ఘాట్, చంద్‌వారా ఘాట్ అనే మూడు ఘాట్ లను అభివృద్ధి చేయనున్నారు. టాయిలెట్లు, ఇన్‌ఫర్మేషన్ కియోస్క్, దుస్తులు మార్చుకునే గదులు, పాథ్‌వే, వాచ్ టవర్ మొదలైన కనీస సదుపాయాల ను కూడా రివర్ ఫ్రంట్ పరిసరాల లో ఏర్పాటు చేస్తారు. ఈ ఘాట్ లు అన్నింటిలోను చక్కని సైన్ బోర్డులు, భద్రత వ్యవస్థ, తగినంత విద్యుత్ దీపాల ను కూడా ఏర్పాటు చేస్తారు. రివర్ ఫ్రంట్ లో చేపట్టే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పర్యాటకుల ను ఆకర్షించి, రాబోయే కాలం లో దీనిని ఒక చక్కటి పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దనున్నాయి.