ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే 2020వ సంవత్సరం జనవరి 3వ తేదీ (శుక్రవారం) నాడు, బెంగళూరు లోని వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం జికెవికె లో 107వ భారతీయ విజ్ఞానశాస్త్ర మహాసభ (ISC)ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆయన ఐ-స్టెమ్ (I-STEM) పోర్టల్ ను కూడా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప మరియు ఇతర ప్రముఖులు కూడాను పాల్గొంటారు.
‘‘విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికత: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి’’ అనేది ఈ సంవత్సరం లో భారతీయ విజ్ఞానశాస్త్ర మహాసభ కు ఇతివృత్తం గా ఉంది. నోబెల్ పురస్కార గ్రహీత లు అనేక మంది, శాస్త్రవేత్త లు, మేధావులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేత లు, పరిశోధకులు, విద్యార్థులు మరియు ప్రతినిధులు సహా మొత్తం 15,000 మంది ఈ కార్యక్రమం లో పాలు పంచుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి చెందిన సంపూర్ణ సమాచారాన్ని ‘‘ISC 2020 UASB’’ మొబైల్ యాప్ లో పొందవచ్చును. అలాగే, గూగల్ ప్లే స్టోర్ యొక్క https://play.google.com/store/apps/details?id=com.indiansciencecongress&hl=en_IN లో కూడా ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు లభ్యమవుతాయి.