ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 జనవరి 2వ తేదీ న గురువారం నాడు కర్నాటక లోని తుమకూరు లో ఒక సార్వజనిక సభ లో రాష్ట్రాల కు కృషి కర్మణ్ పురస్కారాల ను మరియు అభినందన పురస్కారాల ను ప్రదానం చేయనున్నారు. అలాగే, ప్రగతిశీల రైతుల కు వ్యవసాయ మంత్రి యొక్క కృషి కర్మణ్ పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేస్తారు.
ఇదే కార్యక్రమం లో 2019వ సంవత్సరం డిసెంబర్ నుండి 2020 మార్చి నెల మధ్య కాలాని కి గాను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) లో భాగం గా 2000 రూపాయల మూడో వాయిదా ను ప్రధాన మంత్రి విడుదల చేసే ఘట్టం కూడా చోటు చేసుకోనుంది. ఇది రమారమి 6 కోట్ల మంది లబ్ధిదారుల కు ప్రయోజనకరం గా ఉంటుంది. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని ఎనిమిదింటి లబ్ధిదారుల కు పిఎం కిసాన్ పథకం లో భాగం గా ధ్రువ పత్రాల ను కూడా ప్రధాన మంత్రి అందజేయనున్నారు.
ఇదే సందర్భం లో తమిళ నాడు కు చెందిన ఎంపిక చేసిన కొంత మంది రైతుల కు సముద్రం లోతట్టు భాగం లో చేపల ను వేటాడే నౌకల మరియు ఫిషింగ్ వెసల్ ట్రాన్స్‌పాండర్స్ యొక్క తాళం చెవుల ను కూడా ప్రధాన మంత్రి ఇవ్వనున్నారు.
కర్నాటక కు చెందిన ఎంపిక చేసిన కొందరు రైతుల కు కిసాన్ క్రెడిట్ కార్డుల ను (కెసిసి) కూడా ప్రధాన మంత్రి అందజేస్తారు.
సభా స్థలి లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ఈ సందర్భం లో అక్కడ గుమికూడే వారి ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.