ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలుచేస్తూ, ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకూ, కేంద్ర, రాష్ట్ర సంస్థలకూ ఏప్రిల్ 21వ తేదీన విజ్ఞాన్ భవన్ లో ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
పౌరుల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాలను సరైన రీతిలో అమలుచేసే జిల్లాలకూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ.. వారి సేవలకు గుర్తింపుగా ప్రజా పరిపాలనలో ప్రధాన మంత్రి ప్రతిభా పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డు కు నాలుగు ప్రాధాన్యత కార్యక్రమాలు గుర్తించబడ్డాయి. అవి: i) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ii) డిజిటల్ చెల్లింపులు, iii) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – పట్టణ & గ్రామీణ, మరియు iv) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఈ కార్యక్రమాల అమలుకు గాను 11 అవార్డులు. రెండు అవార్డులు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లాలకు అందజేస్తారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ‘న్యూ పాత్ వేస్’ (నూతన మార్గాలు) ‘ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్: అన్ లాకింగ్ పొటెన్షియల్స్’ అనే రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు.
PM will confer Awards for Excellence in Public Administration for effective implementation of identified Priority Programs & Innovation to districts/implementing units & other Central/State organisations at a programme in Delhi this evening. He will also address civil servants.
— PMO India (@PMOIndia) April 21, 2018
PM Awards for Excellence in Public Administration have been instituted with a view to acknowledge, recognize and reward the exemplary work for citizen’s welfare by Districts & Organisations of the Central and State Governments.
— PMO India (@PMOIndia) April 21, 2018
PM will release 2 books on this occasion. ‘New Pathways’ is a compilation of Success stories on implementation of identified Priority Programmes & Innovations while ‘Aspirational Districts: Unlocking Potentials’ is an account of strategies for transforming Aspirational Districts.
— PMO India (@PMOIndia) April 21, 2018