అయోధ్య లో రేపటి రోజు న జరుగనున్న ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’యొక్క శంకుస్థాపన సమారోహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
సమారోహాని కంటే ముందు హనుమాన్ గఢీ లో జరిగే పూజ లో మరియు దర్శన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. తదనంతరం ‘భగవాన్ శ్రీ రాం లలా విరాజ్ మాన్’ యొక్క పూజ లో మరియు దర్శనం లో పాల్గొనడం కోసం ఆయన శ్రీ రామ జన్మ భూమి కి వెళ్లనున్నారు. అటు తరువాత ఆయన ఒక పారిజాత మొక్క ను నాటి, ఆనక భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ యొక్క శంకుస్థాపన కు సూచకం గా ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. అలాగే ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ తాలూకు స్మారక తపాలా బిళ్ల ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.