న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో రేపు (2017, అక్టోబర్ 11వ తేదీ నాడు) ఏర్పాటు చేసిన నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి వేడుక ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
‘‘సాంకేతిక విజ్ఞానం మరియు గ్రామీణ జీవితం’’ ఇతివృత్తం పై ఏర్పాటైన ఒక ప్రదర్శనను ప్రధాన మంత్రి సందర్శిస్తారు. వందకు పైగా మంచి విధానాలు మరియు సేవలను ఈ ప్రదర్శన కళ్ళకు కడుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నూతన ఆవిష్కర్తలతో ప్రధాన మంత్రి భేటీ అయ్యి వారితో సంభాషిస్తారు.
నానాజీ దేశ్‌ముఖ్ మరియు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ లకు ప్రధాన మంత్రి పుష్పాంజలి ఘటిస్తారు.
నానాజీ దేశ్‌ముఖ్ స్మారక తపాలా బిళ్ళను ప్రధాన మంత్రి విడుదల చేస్తారు. జిల్లా స్థాయిలో అభివృద్ధి పనుల సమన్వయం తో పాటు పర్యవేక్షణ కోసం రూపొందించిన ఒక పోర్టల్‌ను ఆయన ప్రారంభిస్తారు. గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన సమాచారంతో కూడిన Gram Samvad App ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ App ను ‘సూచనా సే సశక్తీకరణ్’ (ఎంపవర్‌మెంట్ త్రూ ఇన్ఫర్మేశన్) అనే ఇతివృత్తంతో రూపొందించడమైంది. ఐఎఆర్ఐ లో ప్లాంట్ ఫెనోమిక్స్ సదుపాయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
స్వయం సహాయక బృందాలు, పంచాయతీలు, జల సంరక్షణలో నూతన ఆవిష్కరణల రూపకర్తలు మరియు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లబ్దిదారులు.. ఈ వర్గాలకు చెందిన దాదాపు 10,000 మంది సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.