ప్రపంచ జీవ ఇంధన దినం సూచకంగా 2018 ఆగస్టు 10వ తేదీ న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించే ఒక కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
రైతులు, శాస్త్రవేత్తలు, నవ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు మరియు చట్టసభ ల సభ్యుల తో కూడిన సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం లో జీవ ఇంధనాలు సహాయకారి కాగలవు. అవి ఒక పరిశుభ్రమైన పర్యావరణానికి తోడ్పాటును అందించగలవు; రైతులకు అదనపు ఆదాయాన్ని సంపాయించి పెట్టగలవు; అంతేకాక, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన కు దోహదం చేయగలవు. ఈ కారణంగా స్వచ్ఛ భారత్, రైతుల ఆదాయాలను పెంపొందించడం సహా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో జీవ ఇంధనాలు ముడివడివున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కృషి ఫలితంగా పెట్రోలు లో ఇథెనాల్ కలపడం అనేది 2013-14 ఇథెనాల్ సరఫరా సంవత్సరం లో 38 కోట్ల మీటర్ల స్థాయి లో ఉన్నది కాస్తా 2017-18 ఇథెనాల్ సరఫరా సంవత్సరానికి దాదాపు 141 కోట్ల లీటర్ల కు పెరిగింది. 2018 జూన్ లో ప్రభుత్వం జీవ ఇంధనాల జాతీయ విధానాన్ని సైతం ఆమోదించింది.