రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో పచ్ పద్రలో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2018 జనవరి 16వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు.
రాజస్థాన్ లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. రాజస్థాన్ రిఫైనరీ రాష్ర్టంలో ఏర్పాటవుతున్న మొదటి రిఫైనరీ. ఈ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ సముదాయం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఈ రిఫైనరీలో తయారయ్యే ఉత్పత్తులు బిఎస్ 4 కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 43 వేల కోట్ల రూపాయలు. హెచ్ పిసిఎల్, రాజస్థాన్ ప్రభుత్వం జాయింట్ వెంచర్ లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు.
రాజస్థాన్, గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.