ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25న లఖ్‌నవూ విశ్వవిద్యాలయం శత వార్షిక స్థాపన దినోత్సవం లో ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1920వ సంవత్సరం లో స్థాపించడం జరిగింది. ఇది తన 100వ సంవత్సర ఉత్సవాన్ని జరుపుకోనుంది.
ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ శత వార్షిక స్మారక నాణేన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. ఇండియా పోస్ట్ జారీ చేసే ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను, అలాగే ఒక స్పెషల్ కవర్ ను కూడా ఈ కార్యక్రమంలో ఆయన విడుదల చేస్తారు. కేంద్ర రక్షణ మంత్రి, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ లతో పాటు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటారు.