హజరత్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ సమర్పణాన్ని స్మరించుకొంటూ దావూదీ బోహ్రా సముదాయం ఆధ్వర్యంలో 2018వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ న ఇందౌర్ లో నిర్వహించనున్న ‘అశరా ముబారాకా’కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. దావూదీ బోహ్రా సముదాయం యొక్క ఆధ్యాత్మిక ప్రముఖులు, పరమ పవిత్రులైన డాక్టర్ సయ్యద్‌నా ముఫద్దల్ సైఫుద్దీన్ మరియు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ల ఉపన్యాసాలు ఈ కార్యక్రమం లో భాగంగా ఉంటాయి.