ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 17వ తేదీ నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ కు లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకేడమి ఆఫ్ ఎడ్ మినిస్ ట్రేశన్ (ఎల్ బిఎస్ఎన్ఎఎ) లో 96వ కామన్ ఫౌండేశన్ కోర్సు యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, మంత్రి కొత్త క్రీడా భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు; ఇంకా, పునర్ నిర్మించినటువంటి హేపీ వేలీ కాంప్లెక్స్ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు.
ఎల్ బిఎస్ఎన్ఎఎ లోని తొంభై ఆరో ఫౌండేశన్ కోర్సు సరి కొత్త విద్య మరియు పాఠ్యక్రమం రూపకల్పన తో కూడిన మిశన్ కర్మయోగి యొక్క సిద్ధాంతాల ఆధారంగా రూపొందించినటువంటి ఒకటో కామన్ ఫౌండేశన్ కోర్సు. బ్యాచ్ లో శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన 16 సర్వీసుల కు చెందిన అధికారులు మరియు 3 రాయల్ భూటన్ సర్వీసుల కు (పరిపాలన, పోలీసు మరియు అడవుల)కు చెందిన అధికారులు కలుపుకొని మొత్తం 488 మంది అధికారులు ఉన్నారు.
యువ వర్గం లోని సాహసిక మరియు సరికొత్తవైన ఆలోచన లతో తొణికిసలాడుతున్న ఉత్సాహాన్ని సాన పట్టేందుకు మిశన్ కర్మయోగి సిద్ధాంతాల ను ఆధారం చేసుకొని ఈ నూతన బోధన ప్రణాళిక ను రూపొందించడమైంది. ‘సబ్ కా ప్రయాస్’’ తాలూకు స్ఫూర్తి ని అలవరచేటందుకు పద్మ పురస్కారాల విజేతల తో ముఖాముఖి భేటీ అవకాశాన్ని కల్పించడం, గ్రామీణ భారతదేశం తాలూకు విస్తృతమైన అనుభవాన్ని గడించడం కోసం గ్రామాల సందర్శన కు తీసుకుపోవడం వంటి కార్యక్రమాల ద్వారా శిక్షణార్థి అధికారుల ను ఒక విద్యార్థి/పౌరుడు స్థాయి నుంచి ప్రజా సేవకులు గా పరివర్తన చెందించడం పైన శ్రద్ధ వహించడం జరిగింది. శిక్షణ లో ఉన్న అధికారులు మారుమూల గ్రామాల/ సరిహద్దు ప్రాంత గ్రామాల ప్రజల కు ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటనేది అర్థం చేసుకోవడం కోసం ఆయా ప్రాంతాల ను సైతం సందర్శించారు. నిరంతర శ్రేణిబద్ధ విధానం లో శిక్షణ మరియు స్వీయ అనుభవం తో నేర్చుకోవడం అనే సూత్రాలకు అనుగుణం గా మాడ్యులర్ దృష్టికోణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆరోగ్య పరీక్షల కు అదనం గా, ‘పరీక్ష తాలూకు భారం తో సతమతం అయ్యే విద్యార్థుల’ ను ‘ఆరోగ్యవంతులైనటువంటి యువ స్ఫూర్తి ఉట్టిపడే సివిల్ సర్వెంట్’ గా మార్పు చెందేటట్లు చూడడానికి వారికి ఫిట్ నెస్ టెస్టుల ను కూడా నిర్వహించారు. మొత్తం 488 మంది శిక్షణ లో ఉన్న అధికారుల కు క్రావ్ మాగా తో పాటు ఇతర వివిధ క్రీడల లో ప్రాథమిక స్థాయి శిక్షణ ను ఇవ్వడమైంది.