ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 31వ, జనవరి 1వ తేదీ లలో రెండు ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ లలో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 31న ప్రధాన మంత్రి కేరళ లోని వర్కలా లో శివగిరి మఠం తాలూకు 85వ శివగిరి తీర్థయాత్ర ఉత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రముఖ సామాజిక సంస్కర్త , మహా పురుషుడు శ్రీ నారాయణ గురు పవిత్ర స్థలమే శివగిరి.
2018 జనవరి 1వ తేదీన ప్రధాన మంత్రి కోల్‌కతాలో ప్రొఫెసర్ ఎస్.ఎన్. బోస్ 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే సంస్మరణ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. ప్రొఫెసర్ సత్యేంద్ర నాథ్ బోస్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త. వారు ప్రతిపాదించిన క్వాంటమ్ మెకానిక్స్ కృషికిగాను వారిని స్మరించుకొంటున్నాం. ఇది బోస్- ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ కు పునాది. బోస్, ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ ను అనుసరించే కణాలను ప్రొఫెసర్ బోస్ పేరిట బోసన్స్‌గా నామకరణం చేశారు.