బిహార్ లో చంపారణ్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది సమారోహం ముగింపు ఉత్సవాలను రేపు దేశ ప్రజలు జరుపుకోనుండగా వారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాలుపంచుకోబోతున్నారు.
ఈ సందర్భంగా మోతీహారీ లో 20 వేల మంది స్వచ్ఛత రాయబారులు లేదా ‘‘స్వచ్ఛాగ్రహుల’’ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. స్వచ్ఛాగ్రహులు కాల్బలం వంటి వారు; వీరు పల్లెల స్థాయిలో కమ్యూనిటీ అప్రోచెస్ టు శానిటేశన్ (సిఎఎస్) ను అమలుపరచేందుకు స్ఫూర్తిమూర్తులుగా వ్యవహరిస్తారన్న మాట. దేశంలో మల మూత్రాదుల విసర్జన కు తావు ఉండనటువంటి బహిరంగ ప్రదేశాలను ఏర్పరచాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా పురోగమించడంలో ఈ స్వచ్ఛాగ్రహులు కీలకమైన చోదక శక్తుల పాత్రను పోషిస్తున్నారు.
నీలి మందు సేద్యాన్ని చేపట్టక తప్పని స్థితి ఎదురైన రైతుల హక్కుల కోసం బ్రిటిషు వారికి వ్యతిరేకంగా మహాత్మ గాంధీ చంపారణ్ సత్యాగ్రహాన్ని 1917 ఏప్రిల్ 10 వ తేదీ నాడు ఆరంభించింది మొదలు ఇప్పటికి ఒక శతాబ్దానికి పైగానే కాలం గడచిపోయింది. 2018 ఏప్రిల్ 10వ తేదీని- చంపారణ్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది సమారోహం ముగింపు ఉత్సవాలకు గుర్తుగా- పాటించనున్నారు. దీనిని ‘‘సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్’’ ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా జరుపుకోబోతున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి పథకాలను కూడా ఆవిష్కరించనున్నారు.