ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ న మధ్యాహ్నం 12 గంటల వేళ కు విజ్ఞాన్ భవన్ లో ‘‘డిపాజిటర్స్ ఫస్ట్: గ్యారంటీడ్ టైమ్-బౌండ్ డిపాజిట్ ఇన్ శ్యోరెన్స్ పేమెంట్ అప్ టు రుపీస్ 5 లాఖ్’’ (డిపాజిట్ దారుల కు ప్రాధాన్యం: అయదు లక్షల రూపాయల వరకు కాలబద్ధ డిపాజిట్ రాశి సంబంధి బీమా చెల్లింపు నకు పూచీకత్తు) అంశం పై ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
డిపాజిట్ బీమా అనేది అన్ని రకాలైన డిపాజిట్ లకు- అంటే భారతదేశం లో కార్యకలాపాల ను నిర్వహిస్తున్న అన్ని వాణిజ్య బ్యాంకుల లోని సేవింగ్స్, ఫిక్స్ డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్ లు మొదలైన వాటి కి- వర్తిస్తుంది. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల లో పనిచేస్తున్న రాష్ట్ర, కేంద్ర మరియు ప్రాథమిక సహకార బ్యాంకుల లోని డిపాజిట్ లను సైతం ఈ రక్షణ పరిధి లోకి తీసుకురావడమైంది. ఒక సరికొత్త సంస్కరణ లో భాగం గా, బ్యాంకు డిపాజిట్ ఇన్ శ్యోరెన్స్ సంబంధి రక్షణ ను 1 లక్ష రూపాయల నుంచి పెంచి వేసి 5 లక్షల రూపాయలు గా చేయడం జరిగింది.
ప్రతి ఒక్క డిపాజిట్ దారు కు, ప్రతి ఒక్క బ్యాంకు లెక్క న 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ రాశి కి బీమా రక్షణ ప్రాతిపదిక న గడచిన ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పూర్తి స్థాయి రక్షణ ఉన్న ఖాతాలు మొత్తం ఖాతాల సంఖ్య లో మొత్తం ఖాతాల సంఖ్య లో 98.1 శాతం గా ఉండింది. ఈ విషయం లో అంతర్జాతీయ ప్రమాణాన్ని చూసినట్లయితే అది 80 శాతం గా ఉన్నది.
ఆర్ బిఐ ఆంక్షల కు లోబడివున్నటువంటి 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్ దారుల నుంచి అందుకొన్న క్లెయిముల కు గాను ద డిపాజిట్ ఇన్ శ్యోరెన్స్ ఎండ్ క్రెడిట్ గ్యారంటీ కార్ పొరేశన్ ఇటీవల మధ్యకాలిక చెల్లింపుల తాలూకు ఒకటో విడత ను ఇటీవల విడుదల చేసింది. ఒక లక్ష కు పైగా డిపాజిట్ దారుల కు వారి క్లెయిముల ఆధారం గా 1300 కోట్ల రూపాయల కు మించిన ధనరాశి ని వారి యొక్క ప్రత్యామ్నాయ బ్యాంకు ఖాతాల లో చెల్లింపులు జరపడమైంది.
ఈ సందర్భం లో ఆర్థిక శాఖ కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ సహాయమంత్రి లతో పాటు ఆర్ బిఐ గవర్నరు కూడా పాలుపంచుకోనున్నారు.