ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రభల కాంక్ష కలిగిన జిల్లాల పరివర్తన పై ఏర్పాటయ్యే సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ న్యూ ఢిల్లీ లోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 100 కు పైగా జిల్లాల పరివర్తనకు బాధ్యులుగా ఉన్న అధికారులతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషిస్తారు.
2022వ సంవత్సరం కల్లా ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. నిర్ధిష్టమైనటువంటి అభివృద్ధి పరామితుల విషయంలో మెల్లమెల్లగా నడుస్తున్న జిల్లాలు శరవేగంగా మార్పు చెందడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన విధాన పరమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ జిల్లాలలో అభివృద్ధి పరమైన ప్రత్యేక అవసరాలను తీర్చడంలో కేంద్రం మరియు రాష్ట్రాల ప్రయత్నాలకు సహకరించడానికి అడిషనల్ సెక్రటరీ మరియు జాయింట్ సెక్రటరీ హోదాలోని ప్రభుత్వ సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించారు.