ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి నూతన సంవత్సరాని కి గాను తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు, ఆయన కుటుంబ సభ్యుల కు మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రజల కు క్రొత్త సంవత్సరం లో మంచి ఆరోగ్యం, సమృద్ధి మరియు సాఫల్యం దక్కాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.
విశ్వాసం, పరస్పర ఆదరణ మరియు అవగాహనల పై నిర్మితమైనటువంటి భారతదేశం- యుఎస్ సంబంధాలు అంతకంతకు బలోపేతం అవుతున్నాయని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పేర్కొన్నారు. ఉభయ దేశాల కు మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యం గాఢతరం కావడం లో గడచిన సంవత్సరం లో గణనీయమైనటువంటి పురోగతి నమోదు అయినట్లు ప్రధాన మంత్రి తన సంభాషణ క్రమం లో ప్రముఖం గా ప్రస్తావించి, పరస్పర హితం ముడిపడ్డ అన్ని రంగాల లో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం అధ్యక్షుడు శ్రీ ట్రంప్ తో కలసి పనిచేయడాన్ని కొనసాగించాలన్నది తన వాంఛ అని తెలిపారు.
నూతన సంవత్సరం లో భారతదేశ ప్రజల కు ప్రగతి మరియు సమృద్ధి లభించాలని అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కోరుకున్నారు. గడచిన కొద్ది సంవత్సరాల కాలం లో ఇరు దేశాల సంబంధాల లో ఒనగూరిన కార్యసిద్ధుల పట్ల ఆయన తన సంతృప్తి ని వ్యక్తం చేస్తూ, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గాఢంగా చేసుకొనేందుకు తాను సిద్ధం గా ఉన్నట్లు పునరుద్ఘాటించారు.