న్యూ ఢిల్లీ లోని లాల్ కిలా మైదానం లో గల ఆగస్టు 15 పార్కు లో ఈరోజు జరిగిన దసరా ఉత్సవం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
లవ-కుశ రాం లీల సమితి ఆధ్వర్యం లో నిర్వహించినటువంటి రాం లీల ను కూడా ప్రధాన మంత్రి వీక్షించారు. రావణ, కుంభకర్ణ, మేఘనాద ల భారీ ప్రతిమ ల దహన కార్యక్రమాన్ని కూడా ఆయన చూశారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా వీటిని దగ్ధం చేయడం జరిగింది.
మాన్య రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.