ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు, అంటే మార్చి ఒకటో తేదీ న, న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ ఎస్ లో కోవిడ్-19 టీకామందు తాలూకు ఒకటో డోసు ను వేయించుకొన్నారు.
‘‘ఎఐఐఎమ్ఎస్ లో నేను కోవిడ్-19 టీకామందు తొలి డోసు ను వేయించుకొన్నాను. కోవిడ్-19 కి వ్యతిరేకం గా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నటువంటి పోరాటాన్ని బలపరచడానికి మన శాస్త్రవేత్త లు, వైద్యులు అతి తక్కువ కాలం లోనే చేసిన కృషి ప్రశంసాయోగ్యమైంది. టీకామందు ను వేయించుకోవలసిందిగా అర్హులైన వారందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కలసికట్టుగా మనం అందరం కోవిడ్-19కి తావు ఉండనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరిద్దాం’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv