హంగరీ ప్రధాని శ్రీ విక్టర్ ఓర్బన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ లో మాట్లాడారు.
యూక్రేన్ లోని ప్రస్తుత స్థితి ని గురించి ఇద్దరు నేత లు చర్చించారు. దీనితో పాటు తక్షణం యుద్ధాన్ని విరమించి, చర్చలు – దౌత్యం మార్గాని కి తిరిగిరావాల్సిన అవసరం ఎంతయినా ఉందనే విషయం పై సమ్మతి ని వ్యక్తం చేశారు.
యూక్రేన్-హంగరీ సరిహద్దు మీదు గా 6,000 మంది కి పైగా భారతీయ పౌరుల ను సురక్షితం గా తరలించడానికి మార్గాన్ని సుగమం చేసినందుకు గాను హంగరీ ప్రభుత్వాని కి, శ్రీ విక్టర్ ఓర్బన్ కు ప్రధాన మంత్రి తన హృదయపూర్వక ధన్యవాదాల ను తెలియజేశారు. యూక్రేన్ నుంచి సురక్షితంగా వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల కు ప్రధాని శ్రీ విక్టర్ ఓర్బన్ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేసి, వారు కోరుకొంటే హంగరీ లో వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చన్నారు. ఈ ఉదార ప్రతిపాదన ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
తాజా స్థితి పై సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని, సంఘర్షణ ను ముగించే యత్నాల ను ఇక ముందు కూడా కొనసాగించాలని నేతలు ఇద్దరు అంగీకరించారు.