ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని థెరిసా మే తో ఈ రోజు మాట్లాడారు. మాన్ చెస్టర్ లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో బ్రిటన్ కు ఆయన సంఘీభావాన్ని తెలియజేశారు.
‘‘బ్రిటన్ లోని మాన్ చెస్టర్ లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ప్రధాని థెరిసా మే గారితో మాట్లాడి. మన సంఘీభావాన్ని వ్యక్తం చేశాను. ఉగ్రవాదంపై పోరాడడంలో కలసికట్టుగా ముందడుగు వేద్దామని ఆమెతో అన్నాను’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.
Called @Number10gov @theresa_may to express our solidarity with UK after the terror attack in Manchester. We stand together against terror.
— Narendra Modi (@narendramodi) May 24, 2017