శ్రీ లంక అధ్యక్షుని తో మరియు ప్రధాన మంత్రి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు; శ్రీ లంక లో ఈ రోజు న జరిగిన ఉగ్రవాద దాడుల లో 150 మంది కి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల తన తరఫున మరియు భారతీయులదరి తరఫున ప్రధాన మంత్రి హార్దిక సంవేదన ను వ్యక్తం చేశారు.
ఒక ధార్మిక ఉత్సవం నాడు ధార్మిక స్థలాలు సహా పలు చోట్ల గొలుసుకట్టు రీతి న ఒడిగట్టబడ్డ ఈ ఉగ్రవాద దాడుల ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ తీవ్రాతితీవ్ర పదజాలం తో ఖండించారు. ముందు గా వేసుకున్న ఒక ప్రణాళిక ప్రకారం, నిర్దాక్షిణ్యంగా చేసిన క్రూర చర్య లే ఈ దాడులు అని ఆయన అంటూ, ఇవి మన ప్రాంతం తో పాటు యావత్తు ప్రపంచం లో మానవాళి అంతటికీ ఎదురవుతున్న అత్యంత గంభీరమైనటువంటి సవాలు ను గుర్తు కు తెచ్చే నిరాశాభరిత దాడులు అని కూడా పేర్కొన్నారు.
ఉగ్రవాదం రువ్వుతున్న ఈ తరహా సవాళ్ళ కు శ్రీ లంక ఎదురు నిలచి తన యొక్క భద్రత కు పూచీపడటం కోసం చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని మరియు తోడ్పాటు ను అందిస్తాం అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ఆయన ఈ దాడుల లో గాయపడిన వారు త్వరిత గతి న కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు; వారి చికిత్స కు అవసరమైన అన్ని రకాలుగాను సహాయాన్నందించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.