మాల్దీవుల లో నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల లో విజయం సాధించిన శ్రీ ఇబ్రహీమ్ మొహమ్మద్ సోలిహ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.
ఆయనకు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.
మాల్దీవుల లో శ్రీ సోలిహ్ నాయకత్వం లో ప్రజాస్వామ్యం, శాంతి, ఇంకా సమృద్ధి బలపడగలవన్న ఆకాంక్ష ను కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి తనను అభినందించినందుకు మరియు శుభాకాంక్షలు అందజేసినందుకు గాను శ్రీ సోలిహ్ ధన్యవాదాలు తెలిపారు.
ఉభయ దేశాల మధ్య సన్నిహితమైన, స్నేహభరితమైన మరియు చక్కని ఇరుగు పొరుగుల మధ్య నెలకొనేటటువంటి సంబంధాలు మరింతగా పటిష్టం అయ్యేటట్లు కలసి పని చేద్దామంటూ ఇరువురు నేతలు తమ అంగీకారాన్ని తెలియజేశారు.