ముంబయిలో మరియు ముంబయి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎడతెగని వర్షం కారణంగా తలెత్తిన పరిస్థితిని గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడనవీస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులను ఉపశమింప జేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనన్ని విధాల సహాయం అందజేస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.
‘‘ముంబయిలో మరియు పరిసర ప్రాంతాలలో నిరంతర వర్షం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితి పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవంద్ర ఫడనవీస్ తో మాట్లాడాను, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తగిన సాయం చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చేతనైనంత మద్దతును అందజేస్తుంది. భారీ వర్షం నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రతలు తీసుకొంటూ, క్షేమంగా ఉండవలసిందిగా ముంబయి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Spoke to Maharashtra CM @Dev_Fadnavis on the situation arising due to incessant rain in Mumbai & surrounding areas. @CMOMaharashtra
— Narendra Modi (@narendramodi) August 29, 2017
Centre assures all possible support to the Government of Maharashtra in mitigating the situation due to heavy rains in parts of the state.
— Narendra Modi (@narendramodi) August 29, 2017
Urge the people of Mumbai and surrounding areas to stay safe & take all essential precautions in the wake of the heavy rain.
— Narendra Modi (@narendramodi) August 29, 2017