ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన వరద పరిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ తో మాట్లాడారు.
వరద పరిస్థితిని ఉపశమింప చేయడానికి అన్ని విధాలుగాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సాయపడుతుందని, అంతేకాకుండా పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నార్రు.
“బిహార్ లోని కొన్ని ప్రాంతాలలో వరదల బారిన పడిన వారి కష్ట నష్టాలలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది.
వరద పరిస్థితిని ఉపశమింప చేయడానికి బిహార్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది. రక్షణ కార్యకలాపాలలో, సహాయ కార్యకలాపాలలో పాల్గొనడం కోసం ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు బిహార్‌కు చేరుకొన్నాయి” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
.
My thoughts are with all those affected by floods in parts of Bihar. The situation is being monitored closely: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 14, 2017
Centre assures all support to Bihar government to mitigate the flood situation. Teams of @NDRFHQ are in Bihar for rescue and relief work: PM
— PMO India (@PMOIndia) August 14, 2017