ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కోవిడ్ -19 వాక్సిన్ పంపిణీ, సన్నద్ధత, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్ వాక్సిన్‌కు సంబంధించి కృషిచేస్తున్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఫార్మాకంపెనీలు,ఆవిష్కర్తలను ఆయన అభినందించారు.
వాక్సిన్ రూపకల్పనకు అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆయన వారిని కోరారు.
దేశంలో ప్రస్తుతం ఐదు వాక్సిన్‌లు అడ్వాన్సుడు దశలో ఉన్నాయి. ఇందులో నాలుగు ఫేజ్ -2, ఫేజ్ 3 దశలో ఉన్నాయి. అందులో మరొకటి ఫేజ్ -1, 2 దశలో ఉంది. బంగ్లాదేశ్,మయన్మార్,ఖతార్, భూటాన్, స్విట్చర్లాండ్, బహ్రయిన్, ఆస్ట్రియా, దక్షిణ కొరియాలు భారతదేశ వాక్సిన్ తయారీలో భాగస్వామ్యం వహించడానికి ,దాని వినియోగానికి ఆసక్తి ప్రదర్శించాయి.
వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిని ఉపయోగించేందుకు హెల్త్‌కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల సమాచారం, కోల్డ్ చెయిన్ అభివృద్ధి చేయడం, సిరంజిలు, నీడిళ్లు, తదితరాలను సేకరించడం వంటి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వాక్సినేషన్ సరఫరా చెయిన్ ను పెంపొందించడం, నాన్ వాక్సిన్ సరఫరాలను పెంచడం జరుగుతోంది. వాక్సినేషన్,శిక్షణ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్ధులు, మెడికల్ విద్యార్ధులను , ఫాకల్టీని భాగస్వాములను చేయడం జరుగుతుంది. వాక్సిన్ ప్రతి ప్రాంతానికి చేరేట్టు , ఆయా ప్రాధాన్యతా సూత్రాల ప్రకారం వాక్సినేషన్ జరిగేట్టు చర్యలు తీసుకుంటున్నారు.
భారతీయ పరిశోధన, తయారీకి సంబంధించి అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించేందుకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, రెగ్యులేటర్లతో సమన్వయం చేసుకోవలసిందిగా ప్రధానమంత్రి ఆదేశించారు.
వాక్సిన్ ప్రజలకు అందుబాటులోకితేవడానికి సంబంధించి , రాష్ట్రప్రభుత్వాలతో సంప్రదించిన మీదట నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ -19 (ఎన్.ఇ.జి.వి.ఎ.సి)ని ఏర్పాటు చేయడం జరిగింది. తొలి దశలో ప్రాధాన్యతా వర్గాలకు వాక్సినేషన్ అమలులకు స్టేక్‌హోల్డర్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వాక్సిన్ వేసేందుకు, పంపిణీకి డిజిటల్ ప్లాట్‌ఫారంను రూపొందించి రాష్ట్రాలు, జిల్లా పాలనాయంత్రాంగాల భాగస్వామ్యంతో దానిని పరిశీలించి చూస్తున్నారు..
ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిలో వినియోగం, మందు తయారీ, సేకరణ కు సంబంధించి న అన్ని కోణాలను ప్రధానమంత్రి సమీక్షించారు. మూడవ దశకు సంబంధించి జాతీయ , అంతర్జాతీయ ఫలితాలు వచ్చినట్టయితే మన స్వతంత్ర రెగ్యులేటర్లు సత్వం, కఠిన పరీక్షలు చేసి వాటిని వాడేందుకు తగిన అనుమతులను మంజూరు చేయనున్నారు.
కోవిడ్ సురక్షా మిషన్ కింద కోవిడ్ వాక్సిన్ పరిశోధన అభివృద్ధికి ప్రభుత్వం 900 కోట్ల రూపాయల సహాయాన్ని కేటాయించింది.
వాక్సిన్ త్వరాగా అందుబాటులోకి రావడానికి కాలనియతితో కూడిన ప్రణాళికను రూపొందించుకుని సత్వర రెగ్యులేటరీ క్లియరెన్సులు వచ్చేలా చూడాలని ప్రధానమంత్రి ఆదేశించారు.
వాక్సిన్ అభివృద్ధిలో సమగ్ర కృషిని ప్రధానమంత్రి అభినందించారు. మరోవైపు ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో , కోవిడ్ నియంత్రణ విషయంలో ఎలాంటి వెసులు బాటులు ఉండరాదని, మాస్కులు ధరించడం, భౌతిక దూరంపాటించడం, పరిశుభ్రత పాటించడం కొనసాగించాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రిన్సిపుల్ కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ, నీతిఆయోగ్ మెంబర్ (హెల్త్) ,ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్, సెక్రటరీ హెల్త్, డిజిఐసిఎంఆర్, పి.ఎం.ఒలోని అధికారులు, భారత ప్రభుత్వంలోని సంబంధిత విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.
Reviewed various issues like prioritisation of population groups, reaching out to HCWs, cold-chain Infrastructure augmentation, adding vaccinators and tech platform for vaccine roll-out.
— Narendra Modi (@narendramodi) November 20, 2020
Held a meeting to review India’s vaccination strategy and the way forward. Important issues related to progress of vaccine development, regulatory approvals and procurement were discussed. pic.twitter.com/nwZuoMFA0N
— Narendra Modi (@narendramodi) November 20, 2020