జల శక్తి అభియాన్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నాటి తన ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం లో భాగం గా జల శక్తి ప్రచార ఉద్యమం ప్రజల భాగస్వామ్యం తో వేగవంతమైనటువంటి మరియు విజయవంతమైనటువంటి రీతి లో ముందుకు సాగిపోతున్నదని పేర్కొన్నారు. కొన్ని విస్తృతమైనటువంటి మరియు వినూత్నమైనటువంటి జల సంరక్షణ ప్రయత్నాలు దేశం లోని మూల మూల న పురోగమిస్తున్నాయని శ్రోతల దృష్టి కి ఆయన తీసుకువచ్చారు.
రాజస్థాన్ లోని జాలౌర్ జిల్లా ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘అక్కడ రెండు చరిత్రాత్మకమైనటువంటి మెట్ల బావులు మురికి నీటి తో మరియు వ్యర్థ పదార్థాల తో నిండిపోయాయి. అయితే, ఒక మంచిరోజు చూసి థానావాలా, ఇంకా భద్రాయన్ పంచాయతీల కు చెందిన వందల మంది ప్రజలు జల శక్తి ప్రచార ఉద్యమం లో భాగం గా వాటి ని పునరుద్ధరించాలని ఒక సంకల్పాన్ని తీసుకొన్నారు. వర్షకాలం రాక ముందే ప్రజలు ఆ చోటు లను శుభ్రపరచే బాధ్యత ను వారి భుజాల పైన వేసుకొని ఆ పని లో నిమగ్నం అయ్యారు. ఈ ప్రచార ఉద్యమం కోసం కొంత మంది డబ్బు ను విరాళం గా ఇచ్చారు; మరికొందరు కాయకష్టం చేయడానికి ముందుకు వచ్చారు. తత్ఫలితం గా ఆ మెట్ల బావులు ప్రస్తుతం వారికి ప్రాణాధారం గా సరిక్రొత్త రూపు ను సంతరించుకొన్నాయి.’’
అదే విధం గా, ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో గల సరాహీ సరస్సు పల్లెవాసుల ఉమ్మడి కృషి ద్వారా తిరిగి ఊపిరి పోసుకోవడం జరిగింది. ఉత్తరాఖండ్ లో అల్ మోడా-హల్ద్వానీ హైవే ను ఆనుకొని ఉన్న స్యూన్ రాకోట్ గ్రామం లో ప్రజల ప్రాతినిధ్యం మరొక ఉదాహరణ గా ఉంది. అక్కడి గ్రామస్థులు నీరు తమ గ్రామాని కి చేరుకొనేటట్లు చూడాలని తలచారు. వారు ధనాన్ని సమీకరించి, శ్రమకోర్చారు. గ్రామం వరకు ఒక గొట్టపు మార్గాన్ని వేసుకొని, ఒక పంపింగ్ స్టేశన్ ను వారు ఏర్పాటు చేసుకొన్నారు. దీనితో దశాబ్ద కాలం నాటి నీటి సమస్య కు పరిష్కారం లభించింది.
జల సంరక్షణ, ఇంకా ఇంకుడు గుంతల కు సంబంధించినటువంటి ప్రయత్నాల తాలూకు గాథల ను ప్రతి ఒక్కరు #Jalshakti4India ను ఉపయోగించి ఇతరుల దృష్టి కి తీసుకు రావలసింది గా ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
నీటి సంరక్షణ మరియు జల భద్రత లు ధ్యేయం గా జల శక్తి అభియాన్ పేరు తో ఒక ప్రచార ఉద్యమాన్ని 2019వ సంవత్సరం జులై లో ఆరంభించడమైంది. నీటి ఎద్దడి కి గురి అయిన బ్లాకులు మరియు జిల్లాల పై ఈ ప్రచార ఉద్యమం ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటున్నది.