ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు శ్రీ జిమ్ యోంగ్ కిమ్ నేడు ఫోన్ చేసి మాట్లాడారు.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానాల్లో భారతదేశం చరిత్రాత్మకమైన ఉన్నతి ని సాధించినందుకు గాను ప్రధాన మంత్రి కి శ్రీ కిమ్ అభినందనలు తెలిపారు. 1.25 బిలియన్ కు పైబడ్డ ప్రజల తో ఉన్న ఒక దేశం 4 సంవత్సరాల స్వల్ప కాలం లో 65 స్థానాల ఉన్నతి ని సాధించడం విశేషమని ఆయన అన్నారు.
ఇది ప్రధాన మంత్రి శ్రీ మోదీ అచంచలమైన నిబద్ధత, ఇంకా నాయకత్వాల వల్లనే చాలా వరకు సాధ్యపడిందని కూడా కిమ్ పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన మరియు అపూర్వమైన కార్య సిద్ధి అంటూ ఆయన అభివర్ణించారు.
ప్రధాన మంత్రి ఇటీవల అందుకొన్న సమ్మానాలను కూడా శ్రీ కిమ్ గుర్తు చేసి ఆయనను అభినందించారు. ఈ సమ్మానాలలో యుఎన్ఇపి చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్ అవార్డు, సియోల్ శాంతి బహుమతి లు కూడా ఉన్నాయి.
వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని పెంపొందించేందుకు భారతదేశం అమలు చేసే కార్యక్రమాల ను వరల్డ్ బ్యాంక్ దృఢమైన, ఇంకా నిరంతరాయమైన తోడ్పాటు ను అందించగలదంటూ శ్రీ కిమ్ మాట ఇచ్చారు.
వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగు పరచుకొనేందుకు భారతదేశం సాగిస్తున్న కృషి లో బ్యాంకు మద్దతు ను మరియు మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తున్నందుకు గాను వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగు పరచుకొనేందుకు భారతదేశం సాగిస్తున్న పయనం లో వరల్డ్ బ్యాంక్ స్థానాలు ఒక ప్రేరణ సాధనం గా నిలుస్తున్నాయని కూడా ఆయన అన్నారు.